సర్వాంగ కవచము నీవే
ప్రాణాత్మ దేహము నీవే
నా అంతరంగము నీవే దేవా (2)
నీ పోలికగ చేసి – నీ జీవమును పోసి
నా పాపమును తీసీ
నా భారమును మోసావయ్యా… యేసయ్యా
నా సర్వము నీవే నా యేసయ్యా ఓ.. ఓ..
నా ప్రాణము నీవే నా యేసయ్యా (2)
వాక్యమను ఖడ్గము నీవై – రక్షణను శిరస్త్రాణమై
సత్యమను దట్టివి నీవై నా యేసయ్యా
నీతియను మైమరువునై విశ్వాసమను డాలునై
సమాధాన సువార్త నీవై నా యేసయ్యా ||నా సర్వము||
దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై
బూడిదెనకు ప్రతిగా పూదండవై
దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలము నీవై
భారభరితమైన ఆత్మకు స్తుతివస్త్రమై ||నా సర్వము||