Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సర్వ యుగములలో సజీవుడవు Telugu Christian Songs Lyrics

సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)

ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2)
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో||

స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2)
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో||

కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2)
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో||

సర్వ యుగములలో సజీవుడవు Jesus Songs Lyrics in Telugu


సర్వ యుగములలో సజీవుడవు Telugu Christian Songs Lyrics