సర్వ శరీరుల దేవుడా
నీకసాధ్యమే లేదయ్యా (2)
చాచిన నీ బాహువుతో
భూమి ఆకాశాలు చేసితివే
నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే
లేనే లేదయ్యా హో యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా
లేనే లేదయ్యా మా యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా (2) ||సర్వ శరీరుల||
ఆదాము హవ్వలను చేసినట్టి దేవా
సృష్టికర్త నీకే స్తోత్రము
హేబెలు అర్పణను అంగీకరించిన
గొర్రెపిల్ల దేవా స్తోత్రము
హానోకును నీతో కూడా నడిపినావు
నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు
సర్వశక్తుడా – నీతిమంతుడా
మార్పు లేని మా దేవుడా ||లేనే లేదయ్యా||
అబ్రహాముతో నిబంధనను చేసినావు
అబ్రహాము దేవా స్తోత్రము
ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు
ఇస్సాకు దేవా స్తోత్రము
యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు
యోసేపును పెద్ద రాజుగా చేసినావు
శ్రీమంతుడా – యాకోబు దేవుడా
చూచుచున్న మా దేవుడా ||లేనే లేదయ్యా||
మోషేతో పొద నుండి మాటలాడినావుగా
ఉన్నవాడా నీకే స్తోత్రము
ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు
భీకరుండా నీకే స్తోత్రము
యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు
కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు
మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా
చీల్చబడిన బండ దైవమా ||లేనే లేదయ్యా||
గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా
విజయశీలుడా స్తోత్రము
సమ్సోనుకు సింహ బలమునిచ్చినావుగా
యూదా సింహమా స్తోత్రము
బోయజుతో రూతును విమోచించినావు
సమూయేలును మందసం నుండి పిలిచినావు
పరిశుద్ధుడా – విమోచకుడా
ఎబినేజరు స్తోత్రము ||లేనే లేదయ్యా||
దావీదు నా హృదయానుసారుడంటివే
రాజాధి రాజా స్తోత్రము
సొలొమోనుకు ఆత్మ జ్ఞానమెంతో ఇచ్చినావు
అనంత జ్ఞాని స్తోత్రము
ఏలీయాకై అగ్ని పంపి నీవు గెలచినావు
ఎలీషాకు రెండంతలాత్మనిచ్చినావు
ఆత్మ రూపుడా – రోషవంతుడా
జీవము గల దేవుడా ||లేనే లేదయ్యా||
నెహెమ్యాతో పడిన గోడలు కట్టించినావు
యెరూషలేము దేవా స్తోత్రము
జెరుబ్బాబెలునడ్డగించు కొండ నణిపినావు
మందసపు దేవా స్తోత్రము
ఎస్తేరుచే రాజు ఆజ్ఞనే మార్చినావు
దానియేలును సింహాల నుండి బ్రోచినావు
షద్రక్ మేషాకూ- అబేద్నెగోల దేవుడా
నిత్య రాజ్య స్థాపకుడా ||లేనే లేదయ్యా||
యెహోషాపాతుకై పోరు సలిపినావు
యుద్ధ శూరుడా స్తోత్రము
యబ్బేజు సరిహద్దులిస్తరించినావుగా
యజమానుడా స్తోత్రము
హిజ్కియాకు ఆయుష్షు నీవు పెంచినావు
యెషయాకు దర్శనమును చూపినావు
మహిమ రూపుడా – నిత్య జీవుడా
సింహాసనాసీనుడా ||లేనే లేదయ్యా||
యోబుకు రెట్టింపు దీవెనిచ్చినావుగా
నమ్మదగిన దేవా స్తోత్రము
యోనాను చేప కడుపు నుండి లేపినావుగా
దీర్ఘశాంతుడా స్తోత్రము
యెహేజ్కెలుపై నీ ఆత్మ హస్తముంచినావు
యోహానును త్రోవ సరళ పరచ పంపినావు
ప్రవచనాత్ముడా – మనుష్య కుమారుడా
ప్రవక్తలందరికి దేవుడా ||లేనే లేదయ్యా||
కృపా సత్యములు మాకై తెచ్చినావుగా
యేసు దేవా నీకే స్తోత్రము
తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా
దేవ తనయుడా స్తోత్రము
రక్తధారతో మా పాపమంతా కడిగినావు
మృత్యుంజయుడవై సమాధి గుండె చీల్చినావు
పునరుత్థానుడా – అభిషిక్తుడా
పాపుల రక్షకుడా ||లేనే లేదయ్యా||
పేతురును బండలా స్థిరము చేసినావుగా
పరిశుద్ధాత్ముడా స్తోత్రము
సౌలును అపొస్తలునిగా మార్చినావుగా
ఆశ్చర్యకరుడా స్తోత్రము
యోహానుకు నీ రాజ్య మహిమ చూపినావు
సంఘానికి ఇప్పుడు తోడుగా ఉండినావు
పెండ్లి కుమారుడా – ప్రేమ రూపుడా
రానున్న మా దేవుడా ||లేనే లేదయ్యా||