సర్వ లోకమా స్తుతి గీతం పాడెదం
ప్రభుని నామమును ప్రబల పరచెదం (2)
ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు
స్తుతి మహిమలు సదా అర్పించెదం
అతి సుందరుడు మహిమైశ్వరుడు
ఆయన నామమును కీర్తించెదం ఎల్లప్పుడు ||సర్వ||
అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడు
అన్ని స్థితి గతులలో నడిపిస్తాడు (2)
సంతోషించుమా ఆనందించుమా
ఆయన చేసినవి మరువకుమా
సన్నుతించుమా మహిమ పరచుమా
ఆయన నామమును ఘనపరచు ఎల్లప్పుడు ||సర్వ||
శోధన వేదన ఏది ఎదురైనా
మొరపెడితే చాలునే విడిపిస్తాడే (2)
రక్షకుడేసు రక్షిస్తాడు
ఆయన నామములో జయం మనదే
ఇమ్మానుయేలు మనలో ఉండగా
జీవితమంతా ధన్యమే ధన్యమే ||సర్వ||