సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో (2)
సమానులెవరు ప్రభో
సమస్త మానవ శ్రమాను భవమును (2)
సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ||సమానులెవరో||
సమాన తత్వము – సహోదరత్వము (2)
సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) ||సమానులెవరో||
పరార్ధమై భవ – శరీర మొసగిన (2)
పరోపకారా నరావ తారా (నీ) (2) ||సమానులెవరో||
దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2)
నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2) ||సమానులెవరో||
ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ (2)
పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత (నీ) (2) ||సమానులెవరో||