Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సజీవ సాక్షులుగా Telugu Christian Songs Lyrics

సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం
నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం
ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము
జిహ్వా ఫలము అర్పింతుము (2)
మేమున్నాం నీ చిత్తములో
మేమున్నాం నీ సేవలో (2) ||సజీవ||

తల్లి గర్భమునందు – మమ్మును రూపించి
శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు (2)
ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు
భీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావు
కృంగిపోము మేమెన్నడు
ఓటమి రాదు మాకెన్నడు (2) ||సజీవ||

ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పం
నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ పూర్ణుడా (2)
జడివానలైనా సుడిగాలులైనా – కాడిని మోస్తూ సాగెదం
నిందలయినా బాధలైనా – ఆనందముతో పాడెదం
కలత చెందము మేమెన్నడు
అలసట రాదు మాకెన్నడు (2) ||సజీవ||

సజీవ సాక్షులుగా Jesus Songs Lyrics in Telugu


సజీవ సాక్షులుగా Telugu Christian Songs Lyrics