సాటి ఎవ్వరూ లేరు ఇలలో
సమానులెవ్వరూ ఇహ పరములో (2)
యోగ్యత లేని నాపై దేవా
మితిలేని కృప చూపి
నిరాశే మిగిలిన ఈ జీవితంలో
నిరీక్షణనిచ్చావు ||సాటి ఎవ్వరూ||
దేవా నా కరములనెత్తి
దేవా నిన్నే కీర్తించి
దేవా నిన్నారాధింతును (4)
పాప బానిస బ్రతుకు
ఆకర్షణ నిండిన లోకం
సర్వమనే భ్రమలోనే బ్రతికానే
నీ వాక్యముతో సంధించి
నా ఆత్మ నేత్రములు తెరచి
ప్రేమతో నన్నాకర్షించావే (2)
దేవా నా కరములనెత్తి
దేవా నిన్నే కీర్తించి
దేవా నిన్నారాధింతును (2)
మలినమైన మనసు
గమ్యంలేని పయనం
హృదయమే చీకటిమయమయ్యిందే
నీ రక్తముతో నను కడిగి
నాకు విడుదలను దయచేసి
వెలుగుతో నాకు మార్గం చూపావే (2)
దేవా నా కరములనెత్తి
దేవా నిన్నే కీర్తించి
దేవా నిన్నారాధింతును (2) ||సాటి ఎవ్వరూ||