Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సాగేటి ఈ జీవ యాత్రలో Telugu Christian Songs Lyrics

సాగేటి ఈ జీవ యాత్రలో
రేగేను పెను తుఫానులెన్నో (2)
ఆదరించవా నీ జీవ వాక్కుతో
సేదదీర్చవా నీ చేతి స్పర్శతో (2)
యేసయ్యా.. ఓ మెసయ్యా
హల్లెలూయా నీకే స్తోత్రమయా (2) ||సాగేటి||

సుడి గాలులెన్నో లోక సాగరాన
వడిగా నను లాగి పడద్రోసే సమయాన (2)
నడిపించగలిగిన నా చుక్కాని నీవే (2)
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే (2) ||యేసయ్యా||

వడ గాటులెన్నో నా పయనములోన
నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన (2)
తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే (2)
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే (2) ||యేసయ్యా||

అలల శ్రమలెన్నో బ్రతుకు నావపైన
చెలరేగి విలవిలలాడించే సమయాన (2)
నిలబెట్టి బలపరిచే బలవంతుడ నీవే (2)
కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే (2) ||యేసయ్యా||

సాగేటి ఈ జీవ యాత్రలో Jesus Songs Lyrics in Telugu


సాగేటి ఈ జీవ యాత్రలో Telugu Christian Songs Lyrics