రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా
స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2) ||రక్షకుడా||
సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను (2)
శ్రమ అయిననూ బాధ అయిననూ (2)
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
రక్షకుడా… ||రక్షకుడా||
ఎంచలేని యేసు నాకై హింస పొందెనే (2)
హింస అయిననూ హీనత అయిననూ (2)
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
రక్షకుడా… ||రక్షకుడా||
ఎన్నడైన మారని మా యేసుడుండగా (2)
ఉన్నవైననూ రానున్నవైననూ (2)
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా
హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
రక్షకుడా… ||రక్షకుడా||