రాతి సమాధిలో పాతిన మన యేసు
లేచెను ఈనాడు జై జై జై (2)
దేవాలయము మూడు దినముల లోపల (2)
పడద్రోసి నిలబెట్టె ప్రభు యేసుడు (2)
ఆ బండ నెవరు దొర్లించకుండనే
తెరువంగ బడి యుండె జై జై జై (2) ||రాతి||
వేకువ జామున చీకటి యుండగ (2)
ఏతెంచిరా కాంతలు ఆ చోటకు (2)
ఘుమ ఘుమలాడు సుగంధాలు కొని రాగా
ముందే లేచియుండె జై జై జై (2) ||రాతి||
ఆ మింట నున్న నా తండ్రి కడకు (2)
నేనిపుడేగెద నన్నంటకు (2)
తొలిసారి మరియకు కనిపించి పలికెను
ఉల్లాసమాయెను జై జై జై (2) ||రాతి||