రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్
సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్ (2)
పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంట
లోకాన పండగంట (2) ||రారే||
మనుషుల పాపము బాప మహిమనే వీడాడంట
మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్ (2)
మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులే
మహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్ (2) ||రారే||
రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగను
పాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు (2)
పాప భారము మోసి మరణ కోరలు విరచి
శాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్ (2) ||రారే||