Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

రాకడ ప్రభుని రాకడ Telugu Christian Songs Lyrics

రాకడ ప్రభుని రాకడ
రాకడ రెండవ రాకడ
ఏ దినమో ఏ ఘడియో (2) ఎవ్వరు ఎరుగనిది
రెప్పపాటున కాలమున తప్పక వచ్చునది ||రాకడ||

నోవాహు దినములలో జరిగినట్లుగా
లోతు కాలమున సాగినట్లుగా (2)
పాపమందు ప్రజలంతా మునిగి తేలగా
లోకమంతా దేవుని మరచియుండగా (2)
మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా
మహిమతో తన ప్రజల చేర పిలుచుగా (2) ||రాకడ||

దేవుని మరచిన ప్రజలందరిని
సువార్తకు లోబడని జనులందరిని (2)
శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును
అగ్ని జ్వాలలతో అవని కాల్చును (2)
వేదనతో భూమినంత బాధపరచును
తన మహిమను ప్రజలకు తెలియపరచును (2) ||రాకడ||

రాకడ ప్రభుని రాకడ Jesus Songs Lyrics in Telugu


రాకడ ప్రభుని రాకడ Telugu Christian Songs Lyrics