రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2)
రారే చూడ మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు||
యుదాయనే దేశమందన్నయ్య (2)
యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య (2) ||రాజులకు||
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)
తరలినారే వారు బెత్లెహేమన్నయ్య (2) ||రాజులకు||
బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య(2)
బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య (2) ||రాజులకు||
ఆడుదాము పాడుదామన్నయ్య (2)
వేడుకతో మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు||