రాజా నీ సన్నిధి లోనే దొరికెనే ఆనంద మానందమే
జీవజలముతో పోంగె హృదయమే పాడె స్తుతియు స్తోత్రమే
శ్రమలవేళ నీ ధ్యానమే ఆ గానం ఆధారం ఆనందమే
నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను
విలువౌ కృపను పొందగన్ భాగ్యమే
నిలువని శిరులకన్నను క్షయమౌ ప్రేమకన్నను
విలువౌ కృపను పొందతిన్ స్తోత్రమే . .
1. మరలరాని కాలమల్లె తరలి పోయే నాదు దోషం
నిలువదయే పాప శాపాల భారం
నీలో నిలచి ఫలియించు తీగనై
ఆత్మ ఫలము పొందితినే . .
2. తెలియరాని నీదు ప్రేమ నాలో నింపె ఆత్మ ధైర్యం
జీవ జలమై తీర్చెనె ఆత్మ దాహం
నీకై నిలచి ఇలలోన జీవింప
ఆత్మ ఫలము పొందితినే . .