Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

ప్రియతమ బంధమా Telugu Christian Songs Lyrics

ప్రియతమ బంధమా – నా హృదయపు ఆశ్రయ దుర్గమా
అనుదినం అనుక్షణం – నీ ఒడిలో జీవితం ధన్యము
కృతజ్ఞతతో పాడెదను
నిరంతరము స్తుతించెదను ||ప్రియతమ||

అంధకారపు సమయములోన – నీతి సూర్యుడై ఉదయించావు
గమ్యమెరుగని పయనములోన – సత్య సంధుడై నడిపించావు (2)
నా నిరీక్షణ ఆధారం నీవు
నమ్మదగిన దేవుడవు నీవు (2)
కరుణ చూపి రక్షించినావు
కరుణామూర్తి యేసు నాథా (2)
వందనం వందనం దేవా – వందనం వందనం
అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం ||కృతజ్ఞతతో||

పరమ తండ్రివి నీవేనని – పూర్ణ మనసుతో ప్రణుతించెదను
పరిశుద్ధుడవు నీవేనని – ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను (2)
విశ్వసించిన వారందరికి
నిత్య జీవము నొసగె దేవా (2)
కరుణ చూపి రక్షించినావు
కరుణామూర్తి యేసు నాథా (2)
వందనం వందనం దేవా – వందనం వందనం
అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం ||కృతజ్ఞతతో||

ప్రియతమ బంధమా Jesus Songs Lyrics in Telugu


ప్రియతమ బంధమా Telugu Christian Songs Lyrics