Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

priyathama bandhama naa hrudayapu

ప్రియతమా బంధమ నా హృదయపు ఆశ్రయ దుర్గమ, అనుదినం అనుక్షణం నీ వొడిలో
జీవితం ధన్యము, కృతజ్ఞతతో పాడెదను నిరంతరము స్తుతించేదను

1) అందకారపు సమయములోన నీతి సూర్యుడై ఉదయించావు
గమ్యమెరుగని పయనములోన సత్యసముడై నడిపించావు
నా నీరీక్షణ ఆధారం నీవు, నమ్మదగిన దేవుడనీవు
కరుణ చూపి రక్షించినావు కరుణమూర్తి యేసునాద

కోరస్ – వందనం వందనం దేవా వందనం వందనం, అనుదినం అనుక్షణం నీకే నా వందనం వందనం
కడవరకూ కాయుమయా నీ కృపతో కాయుమయా

2) పరమ తండ్రివి నీవేనని పూర్ణ మనసుతో ప్రణుతిoచెధను
పరిశుధుడవు నీవేనని ప్రానార్పనతో ప్రణమిల్లెదను
విశ్వసించినవారందరికి నిత్యజీవము నొసగే దేవా

దీనుడను నీ శరణు వేడితి ధన్యుడను నీ కృపను పొందితి (x2) || వందనం||