ప్రతి రోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను
పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను (2)
తనివి తీర చూసినా నా యేసయ్య రూపం
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును (2) ||ప్రతి||
పరలోకమందున పరిశుద్ధ దూతలతో
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతియించబడుచుండెను (2)
జీవ జలము యొద్దకు నడిపించును
ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును (2) ||ప్రతి||
ఆకాశమందున రారాజుగా వచ్చును
భూజనులందరు రొమ్ము కొట్టుకొనుచుందురు (2)
కడబూరధ్వని వినిపించును
పరలోక సైన్యముతో వచ్చును
నా హృదయమే పొంగి పొర్లును
నా మనసే సంతోషించును (2) ||ప్రతి||