ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను (2)
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పింపగలనా (2)
ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునా
దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా (2)
ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను (2)
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పించగలనా (2) ||ప్రభువా||
కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి
నా గుడారమునే విశాల పరచి (2)
ఇంతగ నను హెచ్చించుటకు
నే తగుదునా… నే తగుదునా…
వింతగ నను దీవించుటకు
నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా||
నీ నోటి మాట నా ఊటగ నుంచి
నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి (2)
ఇంతగ నను వాడుకొనుటకు
నే తగుదునా… నే తగుదునా…
వింతగ నను హెచ్చించుటకు
నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా||