పాపమెరుగని పావనాత్ముని Telugu Christian Songs Lyrics

పాపమెరుగని పావనాత్ముని
పరిహసించుట న్యాయమా (2)
దోషమెరుగని దీన బాంధుని (2)
దోషి చేయుట ధర్మమా – ధర్మమా ||పాపమెరుగని||

మోయరాని పాప భారము
మోపినారు సిలువపై (2)
గాయమొంది బాధకోర్చి వేదననొంది
ప్రాణమిచ్చుట నేరమా (2) నేరమా ||పాపమెరుగని||

జీవ జలముల త్రోవ చూపి
బ్రోవ నాత్మల దాహమొందె (2)
చావొంది ఆగమై బలి దానమై
జీవమిచ్చుట ఘోరమా (2) ఘోరమా ||పాపమెరుగని||

పాపమెరుగని పావనాత్ముని Jesus Songs Lyrics in Telugu


పాపమెరుగని పావనాత్ముని Telugu Christian Songs Lyrics