ఊరుకో హృదయమా – నీలో మత్సరమా
దేవునివైపు చూడుమా – ఆ చూపులో శాంతి గ్రోలుమా
1. దుర్జనులను చూచి కలవరమేల
దుష్టులు వృద్ధిచెందగా ఆయాసమేల
నమ్మికతో ప్రభుని చిత్తముకై వేడు
తగినకాలములో నిను హెచ్చించును చూడు
2. విశ్రమించు ఆయన ఒడిలో హాయుగా
ధైర్యము వీడక కనిపెట్టు ఆశగా
ఆయన చల్లనిచూపే ప్రసాదించు శాంతి
కలిగించు సహనము తొలగించు బ్రాంతి