ఊహించలేని కార్యములు Telugu Christian Songs Lyrics

ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు
కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2)
దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు
ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు
ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే
కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము ||ఊహించలేని||

ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం
ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2)
కలవాలి హృదయాలు ఒకటై
పండాలి నూరేళ్లు ఇకపై (2)
వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ ||ఊహించలేని||

దేవుని సముఖములో బ్రతకాలి మీరు
మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2)
లోబడి ఉండాలి వధువు
ప్రేమను పంచాలి వరుడు (2)
దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి ||ఊహించలేని||

ఊహించలేని కార్యములు Jesus Songs Lyrics in Telugu


ఊహించలేని కార్యములు Telugu Christian Songs Lyrics