Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

ఓడిపోనివ్వడు Christian Song Lyrics

ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ – అసలోడిపోనివ్వడు

ఓడిపోనివ్వడు – ఓడిపోనివ్వడు (2)
ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు||

పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా
పౌలు లాగా సాగాలిగా (2)
గురి యొద్దకే నీ ప్రయాణము
ఉన్నత పిలుపునకు బహుమానము (2)
సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు||

నా అన్న వారే కాదనగా
రక్త సంబంధులై వెల కట్టారుగా
బానిసలుగా చేసి అమ్మారుగా
యోసేపును చూసాడుగా (2)
తోడుండెనన్న వాగ్ధానము
రాజుల యెదుటే తనకు సన్మానము
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2)

దాటిపోడెన్నడు – దాటిపోడెన్నడు (2)
దీన స్థితిలో మనమున్ననూ – దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ – దాటిపోడెన్నడు (2) ||ఓడిపోనివ్వడు||

ఓడిపోనివ్వడు Jesus Songs Lyrics in Telugu


ఓడిపోనివ్వడు Telugu Christian Songs Lyrics