ఈ లోకం కన్నా మిన్నగా
నా బంధం కన్నా అండగా
అన్నీ నీవై నిలిచి
నను వెదకి వచ్చితివే
నువ్వెవరో యేసు నువ్వెవరో…
నా తల్లి కన్నా నీవే
నా తండ్రి కన్నా నీవే
నా అండ దండ తోడు నీడ నీవై
నన్ను కాచితివే
ఈ లోకం కన్నా మిన్నగా
నా బంధం కన్నా అండగా
అన్నీ నీవై నిలిచి
నను వెదకి వచ్చితివే
నా తల్లి నను మరచే
నేనెన్నో సార్లు ఏడ్చే
నీవు నన్ను మరువక
నా ప్రక్కన ఉంటివే
నా కన్నుల్లోని నీళ్లు నిను మసక చేసెనే
నా కంటి నీరు తుడిచి నేనున్నానంటివే ||ఈ లోకం||
నా తండ్రి నను విడచే
నేనొంటరినై నడచే
నీవు నన్ను విడువక
నా చెంత నడచితివే
ఎవరు లేరనే బాధలో నిన్నే కానకపోయే
తుళ్ళిపడిన వెంటనే నన్నాదుకొంటివే
(యేసు) నువ్వేలే నా సర్వం – (2) ||నా తల్లి||