నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2)
నీ భారము వహియించు యేసు
నీ కొరకై మరణించె చూడు (2) ||నిన్ను కాపాడు||
పలుకరించే వారు లేక పరితపిస్తున్నా
కనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2)
కలతలెన్నో కీడులెన్నో
బ్రతుకు ఆశను అణచివేసినా (2)
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు||
మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా
పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2)
భీతులెన్నో భ్రాoతులెన్నో
సంతసంబును త్రుంచివేసినా (2)
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు||