Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Ninne Ninne namukku

Ninne Ninne Nammukunnaanayya Song Lyrics in Telugu

నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య
నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2)
నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య
నీవుంటే నాకు చాలు యేసయ్య (2) ||నిన్నే||

కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా
కన్నవారే కాదని నన్ను నెట్టినా (2)
కారు చీకటులే నన్ను కమ్మినా
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2)
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||నిన్నే||

చేయని నేరములంటకట్టినా
చేతకాని వాడనని చీదరించినా (2)
చీకు చింతలు నన్ను చుట్టినా
చెలిమే చితికి నన్ను చేర్చినా (2)
చెలిమే చితికి నన్ను చేర్చినా ||నిన్నే||


https://www.youtube.com/watch?v=8uVLNwk5eKg

Source from: https://www.youtube.com/watch?v=8uVLNwk5eKg