Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

నేను ఓడిపోనయా Telugu Christian Songs Lyrics

నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా – (2)

నేను ఓడిపోనయా – నా పక్షానుండగా
నేను కృంగిపోనయా – నీవు నా తోడుండగా (2)
నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా (2)
నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా (2) ||నేను ఓడిపోనయా||

అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే
వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే (2)
ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2)
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా||

నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే
నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే (2)
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2)
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా||

నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే
నన్ను దూషించిన చోటే దీవించినావే (2)
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2)
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా||

నేను ఓడిపోనయా Jesus Songs Lyrics in Telugu


నేను ఓడిపోనయా Telugu Christian Songs Lyrics