నీవే నా దేవుడవు Telugu Christian Songs Lyrics

నీవే నా దేవుడవు ఆరాధింతును
నీవే నా రాజువు కీర్తించెదను (2)

మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే
మరణమునుండి జీవముకు నను దాటించావు
పరలోకమునుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి
చీకటినుండి వెలుగునకు నను నడిపించావు

హోసన్నా మహిమా నీకే
హోసన్నా ప్రభావము రాజునకే (2)
నీవే నీవే నీవే నీవే (2)

పాపిని నను కరుణించిన కరుణామయుడవు నీవే
విలువైన నీ కృపచే నను రక్షించావు
కలువరిలో మరణించి నీ ప్రేమను చూపితివి
పాపమును క్షమియించి నను విడిపించావు

హోసన్నా మహిమా నీకే
హోసన్నా ప్రభావము రాజునకే (2)
నీవే నీవే నీవే నీవే (2)

నీవే నా దేవుడవు Jesus Songs Lyrics in Telugu


నీవే నా దేవుడవు Telugu Christian Songs Lyrics