Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

neethi nyayamulu

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా
నిత్య జీవార్ధమైనవి నీ శాసనములు 2
వృధి చేసితివి పరిశుధ జనముగ
నీ ప్రియమైన స్వాస్థ్యమును….
రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను
నీ రాజదండముతో….
నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

1. ప్రతి వాగ్ధానము నా కొరకేనని
ప్రతి స్ధలమందు నా తోడై
కాపాడుచున్నావు నీవు

నిత్యమైన కృపతో నను బలపరచి
ఘనతను ధీర్ఘాయువును దయచేయువాడవు

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

2. పరిమళవాసనగ నేనుండుటకు
పరిశుధతైలముతో నన్నభిషేకించియున్నావు నీవు

ప్రగతి పధములో నను నడిపించి
ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

3. నిత్య సియోనులో నీతో నిలుచుటకు
నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు

మహిమగలిగిన పాత్రగ ఉండుటకు
ప్రజ్ఞ్హ వివేకములలో నను నింపువాడవు