నీలి ఆకాశంలో (2)
నీ నీతి రాజ్యంలో
నేనుండ గోరితి ప్రభువా ఆ…
నేనుండ గొరెద ప్రభువా (2) ||నీలి ఆకాశంలో||
నా ప్రియుడు నా చెంతనున్నాడు
గోప రసమంత సువాసన కలవాడు
నా ప్రియుడు ఏదేను వనమాలి
కర్పూరాల పుష్పాల సమానుడు
అతని ఎడమచేయి నా తల క్రింద నుండగా
అతని కుడిచేయి నన్ను ఆదరించుచుండగా
ప్రేమతిశయముతో నేను మూర్చిల్లెద – (2) ||నీలి ఆకాశంలో||
నా ప్రియునికి తలుపు తీయ నే లేవగా
నా ప్రాణప్రియుడు నాకే ఎదురాయెను
నా ప్రియుడు ధవళవర్ణుడేతెంచగా
ఆ రత్నాల వర్ణుడు నను తాకగా
నేను నిదురించిన మనసు మేలుకొన్నది
నా మనసంతా యేసుతో నిండగా
రక్షించి నను చేర్చె ఆ ప్రేమ పురమున – (2) ||నీలి ఆకాశంలో||