నీ సన్నిధిలో ఈ ఆరాధనను Telugu Christian Songs Lyrics

నీ సన్నిధిలో ఈ ఆరాధనను
స్వీకరించుము నా ప్రభువా (2)
నా హృదయములో నీ ఆత్మ బలమును
నింపుము నాపై యేసయ్యా ||నీ సన్నిధిలో||

ఆవిరివంటి వాడను నేను
మేఘ స్తంభమై నిలిచావు (2)
చల్లని నీ ప్రేమ గాలిని సోకించి (2)
వర్షముగా నను మార్చావు – మార్చావు ||నీ సన్నిధిలో||

మోడులా మిగిలిన నాకై
సిలువ మ్రానిపై వ్రేళాడి (2)
నీ రక్తముతో నను ప్రోక్షించి (2)
నా మరణ శాపం తొలగించావు – తొలగించావు ||నీ సన్నిధిలో||

నీ సన్నిధిలో ఈ ఆరాధనను Jesus Songs Lyrics in Telugu