నీ సాక్ష్యము ఏది Telugu Christian Songs Lyrics

నీ సాక్ష్యము ఏది
నీ బలియర్పణ ఏది (2)
ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల
ప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళ
మేల్కో లెమ్ము (2)
రారమ్ము విశ్వాసి ||నీ సాక్ష్యము||

అపోస్తుల కాలమందు
ఉపద్రవముల ఒత్తిడిలో (2)
అన్నింటి సహించుచు (2)
ఆత్మలాదాయము చేసిరి ||నీ సాక్ష్యము||

కొరడాతో కొట్టబడిరి
చెరసాలయందుంచబడిరి (2)
చెరసాల సంకెళ్లును (2)
వారినాటంక పరచలేదు ||నీ సాక్ష్యము||

కోత విస్తారమెంతో
కోత కోయువారు కొందరే (2)
యేసు నిన్ పిలచుచుండే (2)
త్రోసివేసెదవా ప్రభు పిలుపును ||నీ సాక్ష్యము||

నీ సాక్ష్యము ఏది Jesus Songs Lyrics in Telugu


నీ సాక్ష్యము ఏది Telugu Christian Songs Lyrics