Nee nama sankeerthana yesayya Lyrics in Telugu
నీనామ సంకీర్తన యేసయ్యా నానోట ఆలాపన
నా గుండె లయలో ప్రభవించిన
నా గొంతునుండి ప్రవహించిన
అ.ప: నీపాటే ఆలంబన – నా బ్రతుకులో సాంత్వన
1 పాటైన నీ మాట ఓదార్చును
వేదనలో ఆదరణ చేకూర్చును
కన్నీటిని తొలగించును – కష్టాలను మరిపించును
నా జీవన రాగమా – నా గాన మాధుర్యమా
2 వేకువనే నిను గూర్చిన ధ్యానము
నా యింట ఉత్సాహ స్తుతినాదము
ప్రతిరోజున వినిపించును – కార్యములను జరిగించును
నా జీవన రాగమా – నా గాన మాధుర్యమా
3 ఆరాధనా స్తోత్ర సంగీతము
ఆర్భాటముతో మ్రోగు వాయిద్యము
నీ కొట్లను తెరిపించును – దీవెనలను కురిపించును
నా జీవన రాగమా – నా గాన మాధుర్యమా
Source from: https://www.youtube.com/watch?v=NpIerlyMElQ