నీ జీవితం విలువైనది Telugu Christian Songs Lyrics

నీ జీవితం విలువైనది
ఏనాడు ఏమరకు
శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం
ఈనాడే యోచించుమా
ఓ నేస్తమా తెలియునా
ప్రభు యేసు నిన్ను పిలిచెను
నా నేస్తమా తెలిసికో
ప్రభు యేసు నీకై మరణించెను ||నీ జీవితం||

బలమైన పెను గాలి వీచి
అలలెంతో పైపైకి లేచి (2)
విలువైన నీ జీవిత నావా
తలకిందులై వాలిపోవ
వలదు భయము నీకేలా
కలదు యేసే నీ తోడు
యేసు మరణించి మరి లేచెను
నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం||

గాఢాంధకారంపు లోయలో
వల గాలి వడి సవ్వడిలో (2)
నడయాడి నీ జీవిత త్రోవా
సుడివడి నీ అడుగు తడబడిన
వలదు భయము నీకేలా
కలదు యేసే నీ తోడు
యేసు మరణించి మరి లేచెను
నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం||

కనలేని గమ్యంబు కోరి
ఎనలేని కష్టాల పాలై (2)
మనలేని నీ జీవిత గాథా
కలలన్ని కన్నీటి వ్యథలే
వలదు భయము నీకేలా
కలదు యేసే నీ తోడు
యేసు మరణించి మరి లేచెను
నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం||

నీ జీవితం విలువైనది Jesus Songs Lyrics in Telugu


నీ జీవితం విలువైనది Telugu Christian Songs Lyrics