Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

nedo repo na

నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాల మీద ఏతెంచును
మహిమాన్వితుడై ప్రభుయేసు
మహీతలమున కేతెంచును

1. చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతి నియ్యడు
నక్షత్రములు రాలిపోవును
ఆకాశశక్తులు కదలిపోవును

2. కడబూర స్వరము ధ్వనియించగా
ప్రియుని స్వరము వినిపించగా
వడివడిగా ప్రభు చెంతకు చేరెద
ప్రియమార ప్రభు యేసునూ గాంచెద

3. నా ప్రియుడేసుని సన్నిధిలో
వేదన రోదన లుండవు
హల్లెలూయా స్తుతి గీతాలతో

నిత్యము ఆనంద మానందమే