Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

నే యేసుని వెంబడింతునని Telugu Christian Songs Lyrics

నే యేసుని వెంబడింతునని
నేడేగా నిశ్చయించితిని
నే వెనుదిరుగన్ వెనుకాడన్
నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని||

నా ముందు శిలువ నా వెనుక లోకాశల్
నాదే దారి నా మనస్సులో
ప్రభు నా చుట్టు విరోధుల్
నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్
నాకిలలో గానిపించరని ||నే యేసుని||

కరువులైనను కలతలైనను
కలసిరాని కలిమి లేములు
కలవరంబులు కలిగిననూ
కదలనింకా కష్టములైనా
వదలను నాదు నిశ్చయము ||నే యేసుని||

శ్రమయైననూ బాధలైననూ
హింసయైన వస్త్రహీనత
ఉపద్రవములు ఖడ్గములైన
నా యేసుని ప్రేమనుండి
నను యెడబాపెటి వారెవరు ||నే యేసుని||

నే యేసుని వెంబడింతునని Jesus Songs Lyrics in Telugu