నను సృజియించిన ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో
అని ఊరువాడ చెట్టుపుట్ట అన్నీ వెదికాను (2)
సృష్టినే దేవుడని నేను పూజించాను
సృష్టికర్తను మరచి నేనెంతో వగచాను
వెదకిన దేవుడు దొరకక పోగా
నేనే దేవుడని సరిపెట్టుకున్నాను (2)
రక్తము కార్చినవాడే దేవుడని (2)
తెలిసిన క్షణమున సిలువను చేరితి
మత చట్రములో దేవుని బంధించి
విదేశీయతను క్రీస్తుకు ఆపాదించి (2)
నిజ రక్షకుని అంగీకరించక (2)
నిష్టగ నరకాన చేరుట న్యాయమా? (2)
నను సృజియించిన ఆ దేవుడు యేసులో ఉన్నాడు
అని ఊరు వాడ పల్లె వెళ్లి తిరిగి చెబుతాను (2)