Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

nannu diddumu chinna prayamu

నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా
కన్న తండ్రి వనుచు నేను నిన్నుజేరితి నాయనా

1. దూరమునకుబోయి నీ దరి జేర నైతిని నాయనా
నేను కారు మూర్ఖపు పిల్లనై కా రడవిదిరిగితి నాయనా

2. మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడ నాయనా
నేను వంచితుండ నైతిని ప్రపంచమందున నాయనా

3. చాల మారులు తప్పిపోతిని మేలు గానకనాయనా
నా చాలమొరల నాలకించుము జాలిగల నా నాయనా

4. కొద్ది నరుడను దిద్ది నన్ను నీ యెద్ద జేర్చుము నాయనా
యెద్దజేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని నాయనా

5. ఎక్కడను నీ వంటి మార్గము నెరుగ నైతిని నాయనా
నీ రెక్కచాటున నన్ను జేర్చి చక్కపరచుము నాయనా