Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

nannakarshinchina nee sneaha bandham

నన్నాకర్షించిన నీ స్నేహ బంధం
ఆత్మీయ అనుబంధం (2)
ఆరాధన నీకే యేసయ్యా (2)
నా చేయిపట్టి నన్ను నడిపి
చేరదీసిన దేవా (2) ||నన్నాకర్షించిన||

మహా ఎండకు కాలిన అరణ్యములో
స్నేహించిన దేవుడవు నీవు (2)
సహాయకర్తగ తోడు నిలచి
తృప్తి పరచిన దేవా
సేదదీర్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన||

చెడిన స్థితిలో లోకంలో పడియుండగా
ప్రేమించిన నాథుడవు నీవు (2)
సదాకాలము రక్షణ నిచ్చి
శక్తినిచ్చిన దేవా
జీవమిచ్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన||