నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా
నమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా (2)
మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురా
ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా ||నమ్మకురా||
ధనము చదువు నేర్పునురా – సంస్కారం నేర్పదురా
ధనము మందులు కొనునురా – ఆరోగ్యం ఇవ్వదురా (2)
వస్తువాహనాల కాధారం
సుఖ సంతోషాలకు బహుదూరం (2) ||నమ్మకురా||
ధనము పెళ్ళి చేయునురా – కాపురము కట్టదురా
ధనము సమాధి కట్టునురా – పరలోకం చేర్చదురా (2)
డబ్బును నమ్మకురా
గబ్బు పనులు చేయకురా (2) ||నమ్మకురా||
ధనము ఆస్తిని పెంచునురా – అనురాగం తుంచునురా
ధనము పొగరు పెంచునురా – పరువు కాస్త తీయునురా (2)
ధనము కోరిక తీర్చునురా
నరకానికి చేర్చునురా (2) ||నమ్మకురా||