నమ్మకమైన నా స్నేహితుడు
నా ప్రభు యేసుడు (2)
ఎడబాయనివాడు విడువనివాడు (2)
నిన్న నేడు ఒకటిగనున్నవాడు ||నమ్మకమైన||
ఆపదలో ఆనందములో నను వీడనివాడు (2)
వ్యాధిలో భాధలో (2)
నను స్వస్థపరచువాడు
అనుక్షణం నా ప్రక్కన నిలచి
ప్రతిక్షణం నా ప్రాణం కాచి (2)
అన్నివేళలా నన్నాదరించువాడు (2)
నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు (2) ||నమ్మకమైన||
కలిమిలో లేమిలో నను కరుణించువాడు (2)
కలతలలో కన్నీళ్ళలో (2)
నను ఓదార్చువాడు
కన్నతల్లిని మించిన ప్రేమతో
అరచేతిలో నను దాచినవాడు (2)
ఎన్నడు నన్ను మరువనివాడు (2)
నా ప్రియ స్నేహితుడు నా ప్రాణ హితుడు (2) ||నమ్మకమైన||