నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమా
నాలోని సమస్తమా
అంధకారమైన లోకమునకు వెలుగై యుంటివి
నను వెలిగించే నా దీపమా
యేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. (2)
ఆకాశమునుండి వర్షింపజేయువాడవు
ఎండిన నేలను చిగురింపజేయువాడవు (2)
సృష్టికర్తా సర్వోన్నతుడా
మహోన్నతుడా నా యేసయ్యా (2)
కోతకాలములో పంటనిచ్చేవాడవు
భూమినుండి ఆహారం పుట్టించువాడవు (2)
సృష్టికర్తా సర్వోన్నతుడా
మహోన్నతుడా నా యేసయ్యా (2)