నాకు బలము ఉన్నంత వరకు
నమ్మలేదు నా యేసుని (2)
బలమంతా పోయాక (2)
నమ్మాలని ఉంది ప్రభు యేసుని (2)
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు (2)
నాకు స్వరము ఉన్నంత వరకు
పాడలేదు ప్రభు గీతముల్ (2)
స్వరమంతా పోయాక (2)
పాడాలని ఉంది ప్రభు గీతముల్ (2)
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు (2)
నాకు ధనము ఉన్నంత వరకు
ఇవ్వలేదు ప్రభు సేవకు (2)
ధనమంతా పోయాక (2)
ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు (2)
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు (2)
హృదయారణ్యములో
నే కృంగిన సమయములో
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు (2)