నాది నాది అంటు వాదులాట నీకెందుకు
ఏదినీది కాదు సత్యమిది ఎరుగ వెందుకు
ఇహలోక ఆశలెందుకు పైనున్న వాటినే వెదుకు (2)
1. నిన్న నీది అనుకున్నది నేడు నీది కాకపోయెనే
నేడు నీకు ముందున్నది రేపు కానరాకపోవునే
క్షణికమైన వాటికొరకు ప్రాకులాట నీకెందుకు
అక్షయ దైవ రాజ్యమే నిలుచును తుదవరకు
2. నీదగ్గర ధనముంటే నీచుట్టు మనుష్యులుంటారు
నీలోపల బలముంటే నిను మా వాడని అంటారు
నీధనము నీబలగం నీ చావునాపలేవు
తప్పకుండ ఒక నాడు మట్టిలోన కలుస్తావు
3. నీకున్న గొప్ప ఖ్యాతి నిన్ను రక్షించలేదు
నీ యెక్క సొంత నీతి శిక్షను తప్పించలేదు
గడ్డి పూవులాంటిదేగదా ఇలలోన నీదు జీవితం
యేసయ్యకు అర్పిస్తే అవుతుందిలే సార్థకం