యేసు స్వామీ నీకు నేను
నా సమస్త మిత్తును
నీ సన్నిధి-లో వసించి
ఆశతో సేవింతును
నా సమస్తము –నా సమస్తము
నా సురక్షకా నీ కిత్తు –నా సమస్తము
యేసు స్వామీ నీకు నేను
ద్రోసి లొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోక యాశల్
యేసు చేర్చుమిప్పుడే ||నా సమస్తము||
నేను నీ వాడను యేసు
నీవును నా వాడవు
నీవు నేను నేకమాయే
నీ శుద్ధాత్మ సాక్ష్యము ||నా సమస్తము||
యేసు నీదే నా సర్వాస్తి
హా సుజ్వాలన్ పొందితి
హా సురక్షణానందమా
హల్లెలూయా స్తోత్రము ||నా సమస్తము||