Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

నా ప్రియుడు యేసు Telugu Christian Songs Lyrics

నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు
వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల(2) ||నా ప్రియుడు||

మెల్లని చల్లని స్వరమే వినబడెను (2)
తండ్రీ వీరేమి చేయుచున్నారో (2)
ఎరుగరు గనుక క్షమించుమనెన్
ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే ||నా ప్రియుడు||

అతని ప్రేమ మధురం మధురం
ఎన్నటికీ నే మరువలేను (2)
ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం
శాపమంతా బాపి నను దీవించెనుగా ||నా ప్రియుడు||

వీపంతా దున్నబడె నాగలితో
కారె రక్త వరదల్ కనుమా (2)
యేసు రక్తంలో రక్షణ – యేసు రక్తంలో స్వస్థత
నాకై మరణించి తిరిగి లేచె సజీవునిగా ||నా ప్రియుడు||

తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి
నాకై విన్నతి చేయుచున్నాడు (2)
రానైయున్నాడు వేగ – మేఘముపై విభుడే
నన్ను పరమ గృహమునకు తోడ్కొని వెళ్ళును ||నా ప్రియుడు||

నా ప్రియుడు యేసు Jesus Songs Lyrics in Telugu


నా ప్రియుడు యేసు Telugu Christian Songs Lyrics