Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

naa prananiki pranam

నా ప్రాణానికి ప్రాణం నీవే యేసయ్యా. . .
స్నేహానికి నిజ స్నేహం నీవే మెసయ్యా. . .

నా ప్రాణానికి ప్రాణాం నీవేనయ్యా
స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా
నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా

1. ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు
కన్నీటి సమయములో ఒంటరిని చేసారు (2)
ఆస్తులున్న వేళ్ళలో అక్కున చేరారు
ఆపద సమయాలలో అంతులేక పోయారు
జంటగ నిలచితివి నా ప్రాణమా కన్నీరు తుడిచితివి
నా స్నేహమా కన్నీరు తుడిచితివి (2)

2. నీవే నా ప్రాణమని కడవరకు విడువ నని
బాసలన్ని మరచి అనాధగ నన్ను చేసారు (2)
నేనున్నానంటు నా చెంతన చేరావు
ఎవరు విడచిన నను విడువనన్నావు
జంటగ నిలచితివి నా ప్రాణమా కన్నీరు తుడిచితివి
నా స్నేహమా కన్నీరు తుడిచితివి (2)