నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా
1. అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించెదన్
2. రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహరమున్
రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్నువీక్షించుచూ స్తుతియింతును