నా నోటన్ క్రొత్త పాట Telugu Christian Songs Lyrics

నా నోటన్ క్రొత్త పాట
నా యేసు ఇచ్చెను (2)
ఆనందించెదను ఆయననే పాడెదన్
జీవిత కాలమంతా (2) హల్లెలూయా ||నా నోటన్||

అంధకార పాపమంత నన్ను చుట్టగా
దేవుడే నా వెలుగై ఆదరించెను (2) ||ఆనందించెదను||

దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెను
రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను (2) ||ఆనందించెదను||

నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే
నిందలోర్చి ఆయనను ప్రకటింతును (2) ||ఆనందించెదను||

వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగా
ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను (2) ||ఆనందించెదను||

భువిలోని బాధలు నన్నేమి చేయును
పరలోక దీవెనకై వేచియున్నాను (2) ||ఆనందించెదను||

నా నోటన్ క్రొత్త పాట Jesus Songs Lyrics in Telugu


నా నోటన్ క్రొత్త పాట Telugu Christian Songs Lyrics