Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

naa hrudayamulo nee maatalu

నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతిరేఖలు 2
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠినహృదయమును కరిగించినావు
నీ కార్యములను వివరింపతరమా ? నీ ఘనకార్యములు వర్ణింపతరమా ?

మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలె కృపను కురిపించితివి2
విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు

విరజిమ్మె ఉదయకాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి 2
అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు ఆర్పజాలని జ్వాలగా చేసి ద్వీపస్థంభముపై నను నిలిపినావు

పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం చేయుటకు
పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు