మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా
విసుగక ప్రార్ధించే మనసు ఉన్నదా (2)
వెలిగే దీపానికి నూనె అవసరం
నీ ఆత్మా దీపానికి ప్రార్ధనవసరం (2)
నూనె లేని దీపము ఆరిపోవును
ప్రార్ధించలేని జీవితము పతనమవ్వును (2) ||మోకాళ్ళ||
శోధనలో పడకుండా ప్రార్ధించుము
శోధన తప్పించుటకు ప్రార్ధించుము (2)
కన్నీటితో ప్రార్ధించిన హిజ్కియాను చూడుము (2)
మరణము తప్పించబడి ఆయుష్షు నొందెను (2) ||మోకాళ్ళ||
ప్రతి నిమిషమందు మనము ప్రార్ధించగలిగినా
పరలోక సంతోషం దేవుడిచ్చును (2)
పట్టుదలతో ప్రార్ధించిన ఏలీయాను చూడుము (2)
ఆకాశ జలములను మూసివేసెను (2) ||మోకాళ్ళ||
అడుగుడి మీకివ్వబడును తట్టుడి మీకు తీయబడును
అన్నాడు మన యేసు అడిగి చూడుము (2)
సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు (2)
అడిగిన వారందరికి తప్పక దయచేయును (2) ||మోకాళ్ళ||